Ambati Rambabu: మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నారా లోకేష్ అవకాశం వచ్చినప్పుడల్లా స్థాయిని మించి మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. కళ్లు నెత్తి మీదకి ఎక్కి… వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో.. 2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి.. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే మీరు ఓడిపోయారు.. కూటమికి 164 సీట్లు వస్తే మీరు గెలిచారు అని వ్యాఖ్యానించారు.. ఇక, అబద్ధాలు ఆడటంలో లోకేష్.. చంద్రబాబును మించిపోయాడు అని ఎద్దేవా చేశారు.. జగన్ తెచ్చిన కంపెనీలను లోకేష్ ఆయనే తెచ్చానని చెప్పుకుంటున్నాడు.. జగన్ తెచ్చిన కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేస్తున్నాడు.. దావోస్ వెళ్లి చంద్రబాబు, లోకేష్ ఏం కంపెనీలు తెచ్చారు? అని ప్రశ్నించారు.
Read Also: Ramanaidu Studio Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రామానాయుడు స్టూడియో భూ కేటాయింపు రద్దు..!
చంద్రబాబు 52 రోజులు పాటు జైలుకి వెళ్లిన ప్రిజనరి అని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి అని సెటైర్లు వేశారు అంబటి.. మీ సహచర మంత్రివర్గ సభ్యులు.. నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో ముందు తెలుసుకోవాలన్న ఆయన.. జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని లోకేష్ చెప్తున్నాడు.. జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీని కల్పించలేదు.. జగన్ ప్రజల్లోకి వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదు అది గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు.. మద్దతు ధరతో మిర్చి ఒక బస్తా ప్రభుత్వం కొనుగోలు చేస్తే నేను మీకు నమస్కారం చేస్తాను అన్నారు.. ఇక, మద్యపాన ప్రియులంతా చంద్రబాబుని తిట్టుకుంటున్నారు.. చంద్రబాబు అందించే 99 రూపాయల మద్యం తాగగానే అరగంటలో దిగిపోతుందట అని కామెంట్ చేశరాఉ.. మరోవైపు.. వక్ఫ్ బోర్డ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనది అందుకే మేం వ్యతిరేకించామని స్పష్టం చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..