YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇక, రేపు (ఏప్రిల్ 8న) ఉదయం 10.40 గంటలకు సత్యసాయి జిల్లా సీకే పల్లి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు.
Read Also: MS Dhoni Retirement: ఐపీఎల్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!
ఇక, ఇటీవల తెలుగు దేశం పార్టీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ లో బెంగుళూరుకు బయలు దేరి వెళ్లనున్నారు.