Vidadala Rajini: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ వాయిదా పడింది.. అయితే, ఈ రోజు కీలక వాదనలు జరిగాయి.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. అసలు రాజకీయ కక్షతో రజినిపై కేసు నమోదు చేశారని హైకోర్టులో వాదనలు వినిపించారు రజిని తరఫు న్యాయవాది.. 2021లో ఘటన జరిగిందని ఇప్పుడు కేసు నమోదు చేశారని.. ప్రస్తుత ఎంపీ కృష్ణ దేవరాయలు కేసులో ఏ2గా ఉన్న ఐపీఎస్ జాషువా ఇచ్చిన నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మండిపడ్డారు.. ఈ ఎంపీ గత ప్రభుత్వంలో రజినితో పాటు ఒకే పార్టీలో అదే జిల్లాలో ఎంపీగా ఉన్నారని, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు తెలిపిన రజిని లాయర్..
Read Also: AP Secretariat: సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి సీఎం.. చెత్తపై సీరియస్..
ఇక, విజిలెన్స్ కి ఏ2 ఇచ్చిన నివేదిక ఆయనకు వచ్చిందటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రజిని తరపు న్యాయవాది.. అయితే, ప్రభుత్వం సమయం కొరటంతో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేయగా.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడదల రజిని హైకోర్టును ఆశ్రయించారు.. ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడుతూ వస్తోన్న విషయం విదితమే..