ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు…
సీఎం జగనే నాకు కొండంత అండ.నేను ఒంటరిని కాదు.. నాకు ఏ వర్గమూ లేదు.సీఎం అండ ఉండగా నేను ఎందుకు ఒంటరి అవుతాను..? అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ణతలు తెలిపేందుకు వచ్చా.పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.మేం సీఎం మనషులం.. సీఎం గీత గీస్తే దాటం. నెల్లూరులో కోల్డ్ వార్ అంటూ ఏమీ లేదు.కుటుంబంలో ఎక్కడైనా చిన్నచిన్న విభేధాలు ఉంటాయి.అందరూ కలసి కట్టుగా…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల్లో అసమ్మతి బయటపడింది. పలు చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలో మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు గొల్ల బాబూరావు, పార్థసారథి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ అసమ్మతి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం జగన్ వెంటనే మేల్కొన్నారు. పార్టీలో వివాదాలను పరిష్కరించడంపై ఫోకస్…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి…
అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే తాను ఎంపీ నందిగం సురేష్ బంధువును అని.. తన వాహనాన్నే ఆపుతారా అంటూ సుధీర్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపీ సురేష్‌కు అతడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను తన ఇంటికి వచ్చి కలవాలని ఎంపీ సురేష్ ఆదేశాలు ఆరీ చేశారు.…
విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పారు. ఇటీవల కేబినెట్లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్…
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ…
ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేషన్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనం వ్యాఖ్యలకు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని…
వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్…