ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులను బిజీ చేయడమే కాదు.. తాను బిజీగా గడుపుతున్నారు.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు.. ఇక, గురువారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి… సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
Read Also: KCR: టీఆర్ఎస్ సుసంపన్న పార్టీ.. ఒక్క పిలుపిస్తే రూ.600 కోట్లు..!
రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్.. ఉదయం 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కించి పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.. అనంతరం లే అవుట్ల పరిశీలన, మోడల్ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేత కార్యక్రమానికి హాజరవుతారు.. పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్‌లో ఉండనుంది.. అనంతరం, అక్కడే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.. తర్వాత పట్టాలు, హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇక, తన పర్యటన ముగించుకుని మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.