2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో పార్టీ పైనే ప్రధానంగా దృష్టి సారించాలని జగన్ సూచించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ట పరచడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే చేస్తుందన్నారు. సర్వేలో రిజల్ట్ బాగా వచ్చినోళ్లకే సీట్లు అని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని.. అందరూ సన్నద్ధంగా ఉండాలని జగన్ సూచించారు. మే 10 నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరమవుతాయని, అందరూ యాక్టివ్‌గా పాల్గొనాలని ఆదేశించారు.
Read Also: KTR: ప్రధానికి ఘాటుగా కౌంటర్.. ఇలా చేస్తే రూ.70కే లీటర్ పెట్రోల్..!