ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా చెలామణి అయిన అవంతి శ్రీనివాస్‌కు పదవీ వియోగం ఏ మాత్రం మింగుడు పడ్డం లేదు. గ్రూప్ రాజకీయాలు, అవినీతి అంటే తనకు తెలియదని.. పార్టీకి విధేయుడిగా ఉన్నా పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. మంత్రి హోదా కోల్పోయిన తర్వాత భీమిలి నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుందనే ఆలోచన కంటే.. అన్ని విధాలుగా జూనియరైన గుడివాడ అమర్నాథ్కు అవకాశం లభించడం మాజీమంత్రి జీర్ణించుకోలేకపోతున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా. ఈ అసంతృప్తిని కొత్త మంత్రికి…
మంత్రివర్గంలో బెర్త్ మొదటిసారి తృటిలో తప్పినా.. రెండోసారి మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఆ ఆనందం మాత్రం మిగలడం లేదు. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టకముందే.. ఒకవైపు సొంత పార్టీ నాయకుల నుంచి.. మరోవైపు పాత కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వచ్చిన కష్టాలేంటి? ఆదిలోనే హంసపాదుగా మారిన విషయాలేంటి? కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు…
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం… దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించారు.. చాంబర్లో ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఇది రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం.. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇక, బడుగులకు జగన్…
మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత. అందరి సూచనలతో రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంత్రి అయినా..రాష్ట్ర స్థాయి బాధ్యతలు వున్నా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి …నేను కలిసి పని చేశాం. నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదం చేసింది. వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం. 70 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రిగా అవకాశం…
ఏపీలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అంతేకాకుండా భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు.…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా…
ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు? సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు…