LPG Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త.. ఇక కష్టాలు తప్పినట్లే…
- వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..
- బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ..
- గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా.. పంపిణీ ఆలస్యమవుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న వార్తలతో.. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయం జనాలకు గురిచేసింది. చాలా మంది ముందు జాగ్రత్తగా బుకింగ్‌లు చేసుకుంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల భయాందోళనలను పటాపంచలు చేస్తూ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Also Read
- IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
ప్రస్తుతం నెలకొన్న కొరత తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్రం పేర్కొంది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఏజెన్సీల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అంటే గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
Also Read:Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..
దీనికి తోడు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయినా.. ఆ రూట్‌తో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా అంతకుమించి చమురును సేకరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. భారత్‌కు అవసరమైన గ్యాస్ నిల్వలను సమకూర్చడానికి త్వరలోనే రెండు భారీ ఎల్ఎన్జీ కార్గోలు దేశానికి చేరనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పరిశ్రమలకు, గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా.. కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. సామాన్యుల ఆవేదనను గుర్తించిన కేంద్రం, యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టడం నిజంగా గ్రేట్ రిలీఫ్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!