కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని…
ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్…
అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న…
కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ…
గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోవిడ్ సోకింది
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత కొన్ని సందర్భాల్లో అసలు వార్త ఏది? వైరల్ ఏది..? ఫేక్ ఏది తెలియని పరిస్థితి ఏర్పడింది.. కొందరు అదే నిజమని కూడా నమ్మేస్తున్నారు.. తాజాగా, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటన హల్చల్ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థని.. సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తామని అచ్చెన్న పేరుతో నకిలీ ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ ప్రకటనను…