Sajjala Ramakrishna Reddy: వరదల్లోనూ చంద్రబాబు ఫోటో విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలే లేవని సజ్జల విమర్శించారు.
Read Also: South Central Railway: ప్రయాణికులకు గమనిక.. పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ప్రస్తుతం వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఆసాంతం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఏ ఒక్కరితో కూడా చెప్పించలేకపోయారని సజ్జల అన్నారు. సాయం అందలేదనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి కనిపించిందన్నారు. 40ఏళ్ల చంద్రబాబు అబద్ధపు రాజకీయ జీవితం ఆఖరి దశకు చేరిందని సజ్జల విమర్శలు చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో పార్టీలకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగిందని.. నిర్దేశిత కాలపరిమితిలో మండల కమిటీలు వేసుకోవాలని సీఎం జగన్ సూచించారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో నేరుగా జగన్ మాట్లాడతారన్నారు. గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేరవేస్తున్నామన్నారు. తమప్రభుత్వంలో లంచం అనేదే లేకుండా నేరుగా లబ్దిదారులకు డీబీటీల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని తెలిపారు. గతంలో ఏం జరిగింది.. ఈ మూడేళ్లల్లో ఏం జరిగిందనే అంశాన్ని బేరీజు వేసుకుంటే ప్రతి ఒక్కరూ జగన్ వైపే వస్తారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్, మోసం ద్వారా మభ్య పెట్టిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రతిపక్షం బురద జల్లుతోందని మండిపడ్డారు. బటన్ నొక్కగానే డబ్బులు ఖాతాల్లోకి వెళ్తున్నాయని.. ఈ తరహాలో బటన్ నొక్కే విధానం గతంలో ఎన్నడూ లేదన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?