పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో జరిగిన సమావేశమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇక నుంచి పార్టీకే పెద్ద పీట వేస్తానని చెప్పారు. పనులన్నీ అనుకున్న సమయానికే పూర్తి కావాలని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారాయన. దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని… పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ప్రతి నెలా ఒక్కో నియోజకవర్గానికి దాదాపు కోటీ 20 లక్షల రూపాయల పనులు ఇస్తున్నామన్న సీఎం, అవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లదేనని చెప్పారు.
Read Also: Corona cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
ఇక, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు… అన్నీ కూడా అనుకున్న సమయానికే పూర్తి కావాలని చెప్పారు సీఎం వైఎస్ జగన్.. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలని వైసీపీ నేతలకు సూచించారు జగన్. బూత్ కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా నిర్వహించే బాధ్యత మీదేనని ప్రాంతీయ సమన్వయర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టాం. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. మీ నియోజకవర్గాలే కాకుండా మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నెరవేర్చాలి నిర్దేశించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు వైఎస్ జగన్.