Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని…
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు…
ఏపీ సీఎం వైఎస్ జగన్ పిల్లా కాదు.. పులి… పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ నారా లోకేష్‌ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని నోరు పారేసుకున్నాడని.. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు ఈ పిచ్చి నా కొడుక్కి అంటూ ఫైర్ అయ్యారు. ఇక, పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారం…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ సోషల్ మీడియా వింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సామాజికి మాధ్యమాల సామూహాన్ని పటిష్టం చేశారు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ రాగా.. ఈ మధ్యే.. సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై విమర్శలు వచ్చాయి.. ఓవైపు మంత్రుల కాన్వాయ్‌పై దాడులు చేశారంటూ జనసైనికులపై కేసులు కూడా పెట్టారు. అయితే, విశాఖ చేరుకున్న పవన్.. ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించిన రోడ్‌షోతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని విమర్శిస్తోంది అధికార పార్టీ.. ఇక, విశాఖ పర్యటనలో తనపై ఆంక్షలు, జనసైనికుల అరెస్ట్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.. దీంతో, ఆయన కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖలో పవన్ చేసిన పనివల్ల…
ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఢిల్లీ నుంచి మళ్లీ రాష్ట్రానికి వచ్చారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్.. ప్రస్తుతం ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా బదిలీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇక, పొర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీర పాండ్యన్‌ను బదిలీ చేసింది.. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్…
YS Jagan Mohan Reddy: మరోసారి అధికారంలోకి రావడం కాదు.. ఈ సారి ఏకంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అందుకు గాను గడగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.. ఇక, కుదిరినప్పుడల్లా.. వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం… ఈ…