Kottu Satyanarayana: పవన్ వల్లే కాపులకు అన్యాయం జరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు వర్గీయులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాజమండ్రిలో ఈ అంశంపై కాపునేతలంతా సమావేశమై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై, చర్యలపై చర్చిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పార్టీని బతికించేందుకు పవన్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తున్నారని మండిపడ్డారు. కాపులు పవన్‌తోనే ఉంటే కాపులు ఎక్కువగా నివసించే రెండు చోట్ల ఎందుకు ఓటమి ఎదుర్కొంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయనకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Read Also: Bandi Sanjay Kumar: ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
కాగా వైసీపీలో ఉన్న కాపు నేతలపై ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు కులం వైసీపీ కాపు నేతల దగ్గర లేదని, తన దగ్గర ఉందని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీపీలో ఉన్న కాపు నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై ఎలా స్పందించాలి? పవన్ కళ్యాణ్‌ను ఎలా కట్టడి చేయాలి? అనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!