Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు.…
గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి పంటపై తాము చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు బాగా కురిసి పంటల దిగబడి గననీయంగా పెరిగిందన్నారు. రైతులు పండించే వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇది భారంగా మారకూడదని మాత్రమే తాను అన్నానన్నారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు.…
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్సీపీ నేత, గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును తెల్లవారుజామును హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే, గతంలోనూ అంటే 2017లోనూ రామశేషుపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు.. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు.. దేశవాలి కత్తితో నరికి చంపారు.. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్…
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ రాయలసీమ గర్జన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ మద్దతు పలికింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన…
Buggana Rajendranath: కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఒక్క మగాడు సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే వైఎస్ఆర్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అని…
Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.…
CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా…
Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.…