టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క గొప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు.. ఇక, ఆయన ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి కాలేరంటూ జోస్యం చెప్పారు.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన నినాదం 175కి 175 స్థానాల్లో విజయం.. అందుకోసం మాకు అప్పగించిన బాధ్యతలు మేరకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నామన్నారు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి లేదన్న ఆయన.. రెండు సంవత్సరాలు కరోనాతో ప్రభుత్వం ఇబ్బంది పడింది.. అయినే సంక్షేమంలో ఎక్కడా వెనక్కి తగ్గిందిలేదన్నారు..
Read Also: Cyclone Mandous: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న మరబోటు
దివంగత నేత వైఎస్ జశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్య శ్రీ గుర్తొస్తుంది, సీఎం వైఎస్ జగన్ పేరు చెబితే నవరత్నాలు గుర్తొస్తాయి.. కానీ, చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క గొప్ప విషయం లేదని సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎంత ప్రయత్నించినా చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి లేదు.. ముఖ్యమంత్రి కాలేరని స్పస్టం చేశారు.. ఇక, ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా ఉన్న సమస్యలు అన్ని పరిష్కరిస్తామని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు పెద్దిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కూడావైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, వరుసగా కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. విభేదాలను వదిలి అంతా.. వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలంటూ చెబుతూ వస్తున్న విషయం విదితమే. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతూ వస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.