Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉండదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. పవన్‌కు రంగులు మార్చడం తేలికే కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2014…
YSRCP: ఇటీవల ఏపీలోని అధికార పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి చెందిన వార్తలను పోస్ట్ చేయడంతో వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రొఫైల్ ఫోటోగా కోతి బొమ్మను పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి తమ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వైసీపీ సాంకేతిక బృందం గుర్తించింది. దీంతో వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్‌కు సమాచారం అందించింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్…
Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు.…
Minister Roja: ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు…
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క గొప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు.. ఇక, ఆయన ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి కాలేరంటూ జోస్యం చెప్పారు.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నినాదం 175కి 175 స్థానాల్లో విజయం.. అందుకోసం మాకు అప్పగించిన బాధ్యతలు మేరకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నామన్నారు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి…
Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్‌డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల…