Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజైన మార్చి 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఒక ప్రత్యేక బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ షో తెల్లవారుజామున 4:00 AM నుండి 5:00 AM మధ్య ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక షోకి టికెట్ ధరను గరిష్టంగా రూ. 500 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు.
Also Read
సాధారణ ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటూనే, సినిమా బడ్జెట్ దృష్ట్యా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. విడుదలైన మొదటి 10 రోజుల పాటు (మార్చి 19 నుండి మార్చి 28 వరకు) ఈ పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. ప్రతి టికెట్‌పై సింగిల్ స్క్రీన్ లో రూ. 100, మల్టీప్లెక్స్ లో రూ. 125 అదనంగా పెంచుకోవచ్చు. అలానే విడుదల రోజున అంటే మార్చి 19న, బెనిఫిట్ షోతో పాటు అదనంగా మరో 5 షోలు (మొత్తం 6 షోలు) ప్రదర్శించుకునేలా మినహాయింపు ఇచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు పోలీస్ కమిషనర్లకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయం పంపిణీదారులకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది.
READ ALSO: Anasuya: వ్యూస్ కోసం అనసూయపై వికృత చేష్టలు.. వ్యక్తి అరెస్ట్
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!