నిన్న విజయవాడలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సభకు ప్రజలు రాలేదని, సభలో ఖాళీ కూర్చిలే దర్శనమిస్తున్నాయంటూ విపక్షనేత పలువురు విమర్శలు గుప్పించారు. అయితే.. వారికి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 85శాతం పైగా ప్రజలు ఎన్నుకున్న బీసీ వైసీపీ ప్రతినిధులు జయహో బీసీ సభకు వచ్చారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. నిన్న బీసీ నేతలంతా అందరూ ఒకచోట చేరి జగన్ పై విశ్వాసం చూపించారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్నటి జయహో బీసీ సభకు 80 వేల పైగా మంది బీసీ ప్రతినిధులు హాజరయ్యారని, సీఎం మాట్లాడుతుండగా కొందరు ముందుకు వెళ్లారు, కొంతమంది అటు ఇటూ వెళ్లి ఉండవచ్చున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Also Read :Airport Express Metro: నగరానికి మరో ప్రాజెక్ట్.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
కొందరు భోజనాలకు వెళ్లడం వల్ల కుర్చీలు ఖాళీ అయి ఉండవచ్చని, జయహో సభలో సీఎం మాట్లాడేటప్పుడు ఖాళీ కుర్చీలు ఉన్నయంటూ ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. దింపుడు కళ్లెం ఆశతో జగన్ పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి టీడీపీనే కారణమని, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ పై కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు, టీడీపీ ఉందని, భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలపైనా సభలు పెడతామని, రీజినల్ పార్టీలో నాయకుడికి సన్నిహితంగా ఉన్నవారు సభలో ఉండటం సహజమేనన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే దాని కోసం వైసీపీ పోరాటం చేస్తుందని, స్కిల్ డెవలప్ మెంట్ పై అక్రమాలు రావాల్సిన సమయంలో బయటకు వస్తాయన్నారు సజ్జల. స్కిల్ డెవలప్ మెంట్‌లో అక్రమాలపై విచారణ జరుగుతుందని, చంద్రబాబు, లోకేష్ అక్రమాలు చేశారనే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.