రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీం లో కేసుపై ఉండవల్లి చేసిన విమర్శలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్దం అని సుప్రీంకోర్టులో కేసు విచారణలో కేసు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మేము తొలి నుంచీ పోరాడుతున్నామని, ఉండవల్లి పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందన్నారు సజ్జల. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైసీపీనేనని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనే అని సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు.
Also Read : Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఏ పార్టీలో అనేది అప్పుడే చెబుతా..!
విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు వినిపిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానమని, రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారని, విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు. విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని, రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని ఆయన అన్నారు.