YSRCP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. అయితే ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి తన బావమరిది శ్రీధర్‌రెడ్డితో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అయితే బావ, బావమరిది మధ్యలో మామ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే మామ వెంకటరమణారెడ్డి తన అల్లుడికి మద్దతుగా నిలబడ్డారు. ఆస్తి కోసం కొడుకు శ్రీధర్ రెడ్డి తనపై హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మారణాయుధాలతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇవాళ గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సురేష్.. అనంతరం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటికి వెళ్లారు మంత్రి.. అయితే, ఆ ఇంట్లో కూర్చుంటున్న సమయంలో.. తుల్లిపడబోయారు.. అప్రమత్తమై వైసీపీ నేతలు.. వెంటనే ఆయన్ను పట్టుకోవటంతో ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి సురేష్.. ఇటీవలే…
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ…
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, ఈ ఉద్యమంలో ఆయా ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేసేపనిలో పడిపోయింది అధికార పార్టీ.. ఇప్పటికే విశాఖ వేదికగా ఉత్రరాంధ్ర ప్రజలతో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనను విజయవంతం చేశారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన భారీ సభ నిర్వహిస్తున్నామని…
Gudivada Amarnath: ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీని అధికారంలోకి తేవాలని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో రూ.9500 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకున్నారని.. ఆ సంస్థను…
Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు…
మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఈ నెల 7వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బీసీ మంత్రులు, అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈనెల 7న జరిగే బీసీ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించనున్న అంశాలను వివరించారు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్. మూడు ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని…
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని…
GVL NarasimhaRao: విశాఖలో భూకబ్జాలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీలకు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాలపై వైసీపీ, టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ, టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నాయని.. పోలవరం నిర్మాణం ఆలస్యానికి వైసీపీ…