ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ,…
ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు..…
ఆంధ్రప్రదేశ్లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..…
మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, మంత్రి గుమ్మనూరు జయరాం.. తన భార్యకు ఐటీ నోటీసులపై స్పందించారు.. నా భార్య కు ఎలాంటి ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.. నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు.. మాది ఉమ్మడి కుటుంబం.. నాభార్య పై భూమి కొంటే బినామీ ఎలావుతుంది? అని నిలదీశారు.. నేను న్యాయ బద్ధంగా భూమి కొనుగోలు చేశానన్న…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్…
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం…
ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు అన్నీ దూకుడు చూపిస్తున్నాయి.. పొత్తులపై ఎవరి ప్రయత్నాలు, ఎవరి ఆశలు వారికి ఉన్నాయి.. ఈ సమయంలో.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎవరితోనూ పొత్తులేదని.. తనకు కేవలం జనంతో మాత్రమే పొత్తు అని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించిన సీఎంకు.. ఘన స్వాగతం…