పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు.
TDP: నెల్లూరు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలోని పది స్థానాల్లో పరాజయం పాలైన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో తన బలాన్ని చూపేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. వైసీపీని వీడిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై ఫోకస్ చేసింది. ఈ ముగ్గురిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 13న…
చంద్రబాబు పీ-4 మంత్రం చెబుతున్నారని.. మంత్రాలు కాదు కావాల్సింది, శక్తి యుక్తి కావాలని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతారని మంత్రి పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చింది లేదన్నారు.