Kurasala Kannababu: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వారాహి యాత్రలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ నేతలు పవన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు.. ఇంత వ్యక్తిగత దూషణలు చంద్రబాబు కూడా చేయలేదన్న ఆయన.. సబ్జెక్ట్ లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయని మండిపడ్డారు.. అకేషనల్ గా రాజకీయాలు చేస్తూ పవన్ కల్యాణ్ బయటకు వస్తున్నారు.. సభ్యత లేని భాషతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మాట్లాడారు.. పవన్‌కు దమ్ముంటే ద్వారంపూడిపై పోటీ చేయాలని సవాల్ చేశారు..
Read Also: Nagarjuna Akkineni: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చిన నాగార్జున?
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కులాలు, కుంపట్లు ప్రారంభం అయ్యాయని వ్యాఖ్యానించారు కన్నబాబు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వస్తే చిరంజీవిని టీడీపీ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌లోనే నిర్భధించింది.. అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు.. ప్రశ్నిస్తాను అనే పవన్.. అప్పటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు.. ఏమైనా.. రాష్ట్రంలో 90 శాతం కాపులు సీఎం వైఎస్ జగన్‌కి మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు మాజీ మంత్రి కన్నబాబు.
Read Also: Food Grain Prices : ద్రవ్యోల్బణం, రుతుపవనాల ఆలస్యం.. 15రోజుల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పు ధరలు
మరోవైపు.. పవన్ కల్యాణ్‌కి నేను ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయిందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. బహుశా వాళ్ళ నాయకుడు నా పై పోటీకి ఒప్పుకోలేదేమో.. అందుకే పవన్ కల్యాణ్ తోక ముడిచి వెళ్లిపోతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. పవన్ స్థాయి నాది కాదు.. అయినా నాపై ఆరోపణలు చేశాడు.. కాబట్టి నేను సవాలు చేశాను.. నేను తొలి సారి చాలా కూల్ గా ఉన్నాను.. రెడ్లు, కాపులు మధ్య గొడవలు సృష్టించాలని పవన్ అనుకున్నాడు.. నేను రెచ్చగొట్టడంలేదు.. సవాల్ మాత్రమే చేస్తున్నాను.. తర్వాత ఆయన నా సవాల్‌పై స్పందించి నా పై పోటీకి రావాలని సూచించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.