Kodali Nani: గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ వేదికగా చంద్రబాబుకు ఓపెన్ చాలెంజ్ విసిరిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని.. పనిలోపనిగా పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.. ఇక పవన్ కల్యాణ్ మీకు ఒక సవాల్ చేశాడు. ఆయన అసెంబ్లీలో అడుగుపెడతాను దమ్ముంటే ఆపు అంటున్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలో అడుగుపెట్టడానికా..? ఆయన దేనికి పార్టీ పెట్టాడు..? సీఎం అవ్వడానికా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.. కానీ, శాసనసభకు వెళ్ళే పరిస్ధితుల్లో కూడా పవన్ కల్యాణ్ లేడని సెటైర్లు వేశారు.. ఇద్దరు హీరోయిన్లు ఎంపీలు అయ్యారు.. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లు.. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీలు అయ్యారు.. కానీ, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ప్యాకేజీ స్టార్.. ఇలా ఆకాశంలో ఉన్న స్టార్లు అన్నీ ఉంటాయి.. 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ కల్యాణ్ ఏం సాధించాడు? కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.
Read Also: Anasuya Bhradwaj: బికినీ ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. మిస్ అవ్వకూడదంట!
చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటం.. పవన్ కల్యాణ్ కోరిక ఎమ్మెల్యే కావటం.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు కొడాలి నాని. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ధైర్యం ఈ దేశంలోనే ఎవరికీ లేదన్న ఆయన.. చనిపోయేంత వరకు జగన్ మనిషిగా ఉంటా.. గుడివాడ ప్రజలు అందరూ మీతోనే ఉంటారు అని సభా వేదికగా సీఎం జగన్‌కు తెలిపారు. రూ. 1500 కోట్లకు పైగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి. గుడివాడ అభివృద్దికి ఇంకా కొంత డబ్బు అవసరం. మీరు వచ్చే ఐదేళ్లు కూడా సీఎంగా ఉంటారు. రాష్ట్రానికి పర్మినెంట్ సీఎం మీరు. మిమ్మల్ని ఆ సీట్ నుంచి దించగల మగాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.. గుడివాడ ఎమ్మెల్యేగా నేనే ఉంటా. వచ్చే ఐదేళ్లలో మిగిలిన సాయం చేస్తే చాలు అని విజ్ఞప్తి చేశారు కొడాలి నాని.