కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో…
బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీసీలు అంటే ఆర్.కృష్ణయ్య గుర్తొస్తారని తెలిపారు. బీసీలకు సాధికారత చేయడం ఓట్లకోసం కాదని సజ్జల అన్నారు. బీసీ సాధికారత దిశగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం పని చేసిందని పేర్కొన్నారు.