Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
- నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి..
- ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో ఈ వార్త తీరని శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం వారిని తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Also Read:10th Exams: పదో తరగతి పరీక్ష రాయకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన విద్యార్థి.. కారణం ఏంటంటే..
Also Read
- Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
- Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
- Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
- Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
ప్రాథమిక సమాచారం మేరకు.. మితిమీరిన వేగం లేదా డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. దేవతపల్లి గేట్ వద్ద మలుపు ఉండటం, అదే సమయంలో లారీ వేగంగా రావడంతో ఆటోను తప్పించే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఎవరు..? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రహదారులపై పెరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే మలుపుల వద్ద డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి స్థాయి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!