Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఏమిటీ కుంభకోణం..
ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే వాడుకోవాలి. అయితే, దర్యాప్తులో వెల్లడైన నిజాలు యాజమాన్యాన్ని షాక్‌కు గురిచేశాయి.. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ‘బంధువుల’గా చూపి ఉచిత టిక్కెట్లు పొందారు. మరికొందరు ఉద్యోగులు ఒకడుగు ముందుకు వేసి, ఉచితంగా పొందిన టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
కొత్తగా చేరిన వారే ఎక్కువ..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16% మంది (4,000 మంది) ఈ అక్రమాలకు పాల్పడ్డారు. విశేషమేమిటంటే, ఈ కుంభకోణంలో చిక్కుకున్న వారిలో మెజారిటీ ఉద్యోగులు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత, అంటే టాటా గ్రూప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేరిన వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టాటా యాజమాన్యం రికవరీ చర్యలు ప్రారంభించింది. మోసపూరితంగా వాడిన టిక్కెట్ల విలువను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడమే కాకుండా, వారి ప్రయాణ సౌకర్యాలను రద్దు చేస్తున్నారు. ఇకపై నామినీలను చేర్చుకోవాలంటే చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు. నష్టాల నుంచి గట్టెక్కి, సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తుంటే, ఉద్యోగులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదని, ఉద్యోగుల నైతికతకు సంబంధించిన సమస్య అని ఎయిర్ ఇండియా వర్గాలు స్పష్టం చేశాయి.
READ ALSO: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..