ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి గుడ్బై చెప్పేశారు.. ఎంపీ పదవితో పాటు.. జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. చిత్తూరులో వైసీపీ మూకల దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటనన చేసే అవకాశం ఉంది. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు.. తీవ్ర మనస్థాపానికి గురైన వేమిరెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు.