Ponguru Narayana: నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తాం.. క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఆయన.. వచ్చే నెల రెండో తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై చర్చించారు.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన నారాయణ.. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తాం.. క్లీన్ స్వీప్ చేస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలే లేరన్న ఆయన.. వచ్చే నెల రెండో తేదీన జరిగే చంద్రబాబు టూర్‌లో.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని వెల్లడించారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చంద్రబాబు – పవన్ కల్యాణ్ చర్చించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది మాకు తెలియదన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే చంద్రబాబు క్లారిటీ ఇస్తారని తెలిపారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ.
Read Also: Rahul Gandhi: మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం..
కాగా, నెల్లూరులో మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. ఇప్పటికే వీపీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన వీపీఆర్ కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు భారీ సమావేశం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ.. అక్కడే.. చంద్రబాబు సమక్షంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్ది.. టీడీపీ కండువా కప్పుకోనున్నారు.. వారితో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున.. టీడీపీ చేరతారని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.