YSRCP: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.
Read Also: Chicken Prices: తగ్గేదే లే.. చుక్కల్లో చికెన్ ధరలు
అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 3వ తేదీన మరో ‘సిద్ధం’ సభ నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నెల 27న మండల స్థాయి నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్ రానున్నారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.