రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…