MP Margani Bharat: ఎన్నికల టిక్కెట్లు కేటాయింపు విషయంలో జన సైనికుల పరిస్థితి బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. టీడీపీ-జనసేన ఉమ్మడి లిస్ట్ ప్రకటన తర్వాత టీడీపీ, జనసేన నేతలు కొన్ని ప్రాంతాల్లో చేస్తోన్న ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే కాగా.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్.. 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు.. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఒరగ బెట్టేది ఏమీ ఉండదని విమర్శలు గుప్పించారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆంధ్రప్రదేశ్ కు ది బెస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కితాబిచ్చారు.. మరోవైపు.. జనసేన నేత కందుల దుర్గేష్‌కు సీటు దక్కకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కందుల దుర్గేష్ జనసేన పార్టీలో ఉండాల్సిన నేత కాదన్న ఆయన.. కందుల దుర్గేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీ అధిష్టానం ఆహ్వానిస్తుందనే అనుకుంటున్నానని అన్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కల్యాణ్ ఉన్నారని ఆరోపించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.
Read Also: Paytm : పేటీఎం నుండి విజయ్ నిష్క్రమించిన తర్వాత.. కంపెనీ డెవలప్ మెంట్ ప్లాన్ ఇదే
కాగా, మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టిక్కెట్ కందుల దుర్గేష్ కు ఇవ్వాలని జనసేన పార్టీ శ్రేణులు భారీ పాదయాత్ర నిర్వహించాయి.. కడియం దేవిచౌక్ సెంటర్ నుండి పాదయాత్రను ప్రారంభించారు.. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొ్ంటున్నారు జనసేన పార్టీ శ్రేణులు.. కడియం నుండి వేమగిరి ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి వరకు జనసేన మహా పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు..