ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
వైసీపీ అభ్యర్థుల గురించి ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అని ఆయన తేల్చి చెప్పారు.
టీడీపీ-జనసేన జాబితాపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ దయనీయంగా మారారని.. చంద్ర బాబు ఏది పడిస్తే దానికి పవన్ తృప్తి పడడం అలవాటు అయ్యిందని ఎద్దేవా చేశారు.