Gollapalli Surya Rao: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తొలి జాబితా.. కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజేస్తోంది.. తొలి జాబితాలో సీటు దక్కనివారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. ఇక తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తోన్న నేతలు.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీని వీడీసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.. రాజోలు అసెంబ్లీ ఆశించిన ఆయన.. టిక్కెట్ కేటాయించలేదని అసంతృప్తితో పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారట.. ఇక, గొల్లపల్లి సూర్యారావు ఇంటి వద్ద.. గతంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలును కూడా తొలగించారు అనుచరులు.. ఆ తర్వాత రాజోలు నుండి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారట గొల్లపల్లి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.. ఇదే సమయంలో.. వైసీపీ నుంచి ఆయన అమలాపురం పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరి రాజకీయాల్లో.. అది కూడా ఎన్నికల సమయంలో ఏదైనా సాధ్యమే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అడుగు ఎటువైపు పడతాయే.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచిచూడాలి…