MP Mithun Reddy: అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావచ్చని.. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో అని ఎంపీ మిథున్ రెడ్డి తన మనస్సులోని మాటను తెలిపారు. ఈ సారి రాజంపేట ఎంపీగా గెలుస్తాను, నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎంపీగా నిలబడతానో లేదోనని ఆయన తన మనస్సులోని సందేహాన్ని బయటపెట్టారు. రాజంపేట పార్లమెంట్‌లో అభివృద్ధికి కృషి చేస్తానని వాల్మీకిపురం ప్రజలకు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also: CM YS Jagan Tour: బనగానపల్లెలో మార్చి 4న సీఎం జగన్ పర్యటన
ఇదిలా ఉండగా.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్ మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైనప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 8 జాబితాల్లో నియోజకవర్గ ఇంచార్జులను ప్రకటించి ముందుకు వెళ్తున్న వైసీపీ మేనిఫెస్టోపై దృష్టిసారించింది. గతంలో ప్రకటించి అమలు చేసిన నవరత్నాలతో పాటు, కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీనియర్ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఈసారి మహిళల కోసం మరిన్ని కొత్త పథకాలు అమలుపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.