MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీసీ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ మండల అధ్యక్షుడు యేలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డికి 14 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ మాట్లాడుతూ.. నవరత్నాలు పథకాలను కుల, మత, పార్టీలు చూడకుండా అర్హులకు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు.
Read Also: YS Jagan: పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం జగన్
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ సగినాల రాయలమ్మ, జడ్పీటీసీ పగడాల దేవి, శ్రీరంగం, నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయ ఛైర్మన్ కన్నసాని చిన్న ఓబులేసు, రామాపురం సొసైటీ అధ్యక్షుడు మదిరె శ్రీరంగరెడ్డి, వైస్ ఎంపీపీ ఎలిశమ్మ, జేఏసీ మండల కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి, అనుములపల్లె, పాలకవీడు, ఆకవీడు, కాలువ పల్లె, గౌతవరం సర్పంచులు సిరిగిరి రమేష్, పల్నాటి లతీఫ్, దేవదానం. మీనిగ నారాయణమ్మ, లక్ష్మీదేవి, ఎంపీటీసీలు రవి, యేలం వెంకట రాజేశ్వరి, మండల కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ బాషా, వైసీపీ నాయకులు సూరా పాండురంగారెడ్డి, సూరా స్వామిరంగారెడ్డి, బద్దేటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.