YSRCP 9th List: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైసీపీ 9వ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ జాబితాను రిలీజ్ చేసింది.
Read Also: IAS Transfers: ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ
ఇందులో నెల్లూరు పార్లమెంటరీ స్థానం ఇన్‌ఛార్జ్‌గా సమన్వయకర్తగా విజయసాయి రెడ్డిని నియమించింది. కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా ఇంతియాజ్.. మంగళగిరి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా మురుగుడు లావణ్యను నియమించిది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇదిలా ఉండగా.. కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఇంతియాజ్ ఐఏఎస్‌గా వీఆర్‌ఎస్ తీసుకుని గురువారమే వైసీపీలో చేరారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2028 జూన్ వరకు విజయసాయిరెడ్డి పదవీకాలం ఉంది.