Nandigam Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ నామస్మరణ చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి 12 ఏళ్లు అయినా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. పవన్ కళ్యాణ్‌కు 60 ఏళ్ళు వస్తున్నాయి.. అందుకే ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశాయి. జగన్ పెట్టిన ఇద్దరు అభ్యర్థుల మీద 2019లో పవన్ ఓడిపోయారన్నారు. పాతాళానికి తొక్కుత అంటున్నాడు… ఎలా అన్నది పవన్ చెప్పాలన్నారు. పవన్ హుందాగా మాట్లాడలేరు.. నక్క అయిన చంద్ర బాబుతో సహవాస దోషమని విమర్శించారు.
Read Also: MP Mithun Reddy: ఎంపీగా ఇవే నా చివరి ఎన్నికలు!.. ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ముద్రగడ ,హరి రామయ్య జోగయ్య మీద తప్పుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన అన్నారు. పవన్‌కు జెండా లేక.. చంద్ర బాబు జెండాను పట్టుకున్నారన్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు మాట్లాడినట్టు పవన్ కల్యాణ్ మాట్లాడారన్నారు. తన అభిమానులను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని ఆయన విమర్శలు గుప్పించారు. తాడేపల్లి ప్యాలెస్‌ను కూలగొడతారట పవన్ కల్యాణ్.. ఒకసారి ప్రయత్నం చేసి చూడు.. పోలీసులు పవన్‌ను వేలాడదీస్తారన్నారు.
Read Also: Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి
2009లో పవన్ కళ్యాణ్‌కు బాబు దొంగ.. 2014లో దొర.. 2019లో దొంగ.. 2024లో దొర.. బాబుకు అమ్ముడుపోయి పవన్ కల్యాణ్ మాట మారుస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. మగవారిపై పోటీ అయిపోయి.. ఇప్పుడు ఆడవాళ్లపై పోటీకి పవన్ రెడీ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్‌ను నాలుగవ పెళ్లాంగా రమ్మని పవన్ అంటున్నారు.. మగాళ్లతో సంసారం ఏంటీ పవన్.. ఏ స్థాయికి దిగజారిపోయావంటూ నందిగం సురేష్ ప్రశ్నించారు. ఒక ఇరవై రోజులు తలకు రంగు వేయకపోతే.. పవన్ కల్యాణ్‌ను రోడ్డు మీద ఎవరు గుర్తు పట్టరన్నారు.