Perni Nani: పవన్‌కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌లా పవన్.. జగన్ దగ్గర అవ్వన్నీ నడవవన్నారు. యుద్ధం అంటున్నావ్ పవన్ …2014, 2019లో ఏమి చేసావు.. జగన్ నీకు పెద్ద సినిమా చూపించాడన్నారు. 2019లో అమరావతి కొందరి రాజధాని అని పవన్ కల్యాణ్ అన్నారని.. కుల రాజధాని అన్నారని.. చంద్రబాబుకు, నీకు మధ్య ఏమిటి లాలూచీ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 24 సీట్లు కాకపోతే, సున్న తీసుకో పవన్ కల్యాణ్.. వైసీపీకి ఏంటి అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సున్న సీట్లు కదా అంటూ వ్యాఖ్యానించారు. ముద్రగడ ఇంటికి వెళతా అన్నారు…ఆయనకు ఉంటుంది బాధా …మాకు ఎందుకు బాధ అని అన్నారు. చంద్రబాబును పాతాళంకు తొక్కేది పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడలేదన్నారు. ఎంత కర్మ పవన్ కల్యాణ్‌కు అంటూ ఎద్దేవా చేశారు.
పురాణాలతో పోల్చడానికి ఏమి ఉందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను పురాణాల్లోని శల్యుడితో పోల్చవచ్చన్నారు. శల్యుడిలాగా పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులను నీరు కారుస్తున్నారన్నారు. యుద్ధం మధ్యలో వస్తున్న శిఖండిలా పవన్ కల్యాణ్ వస్తున్నారని విమర్శించారు. వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో జగన్ నాట్ కిల్డ్ బాబాయి అని ఆనాటి సీఎం చంద్ర బాబు అన్నారని.. మరి హూ కిల్డ్ ఎన్టీఆర్ అంటే? ఏమి చెబుతారని ఆయన ప్రశ్నించారు. జబర్దస్త్, సినిమా డైలాగ్‌లు ఎందుకు పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 2009లో చంద్ర బాబుది సైకిల్ కాదు అన్నారు.. తిట్టిన తిట్టు తిట్టారు యువ రాజ్యం అధ్యక్షుడిగా.. మళ్ళీ 2014లో చంద్రబాబుతో స్నేహం చేశాడు పవన్ కల్యాణ్ అని ఆయన తెలిపారు. ఇక 2019 లో మళ్ళీ చంద్రబాబుతో మళ్ళీ రాజకీయ వైరం పెట్టుకున్నాడని.. మరి సినిమా డైలాగ్‌లు ఎందుకు పవన్ అని పేర్ని నాని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ జెండాలను ప్రజలు మడత వేయడం ఖాయమన్నారు.
పవన్ కళ్యాణ్ తల్లి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తల్లి, తండ్రి ఆయన దగ్గర ఎప్పుడు అయిన ఉన్నారా అని ప్రశ్నలు గుప్పించారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి తల్లిని దూరంగా పెట్టారని అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సొంత ఇంటిలో ఉన్నారు విజయమ్మ అని పేర్ని నాని తెలిపారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు తేడా అనుకున్నాం.. జగన్‌ను నాలుగవ పెళ్ళాంగా రా అంటున్నావు ..ఈ తేడా కూడా ఉందా నీకు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.