MP Margani Bharat: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎంపీ భరత్ చాలెంజ్.. ఆ దమ్ముందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించిన టీడీపీ-జనసేన.. బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి.. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? అని సవాల్ చేశారు.. ఇదే చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు 14 సంవత్సరాలు రాష్ట్రాలు పాలించాడు.. అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు.. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.. చంద్రబాబుతో బీసీలకు సంబంధించిన చర్చలకు నేను రెడీగా ఉన్నాను అన్నారు.
Read Also: Underwater Metro : అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించి.. అందులో ప్రయాణించిన మోడీ
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ఇక, బీసీలకు సీఎం వైఎస్ జగన్ 75 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు.. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడిందని వివరించారు ఎంపీ భరత్.. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధం మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన.. బీసీల డీఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పే చంద్రబాబు.. బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే అని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు.. కనీసం నువ్వు ఆ సాహసం చేశావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది..? కదా అన్నారు. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు అని చంద్రబాబును నిలదీశారు ఎంపీ భరత్.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!