ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలింగ్ బూతులపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాశారు. పోలింగ్ బూతుల్లో తీసుకోవాల్సిన చర్యలు.. ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు.
ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పశ్చిమ ప్రాంతవాసుల వరప్రధాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు..