Gummanur Jayaram: టీడీపీలో చేరిన మంత్రి జయరాం.. తొలి స్పందన ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి పదవితో పాటు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.. బడుగులకు స్వతంత్రం రావాలి.. టిక్కెట్లు బడుగులకిచ్చి.. అగ్ర కులాలకు ఇంఛార్జీలను ఇస్తే స్వతంత్రం ఉంటుందా..? అని టీడీపీ చేరిన తర్వాత వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
Read Also: Minister Buggana Rajendranath Reddy: భారత్‌లోనే విశాఖ అన్ని ప్రాధాన్యతలు వున్న నగరం..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
కాగా, వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తొలిసారి ఈ రోజు ఓ మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు.. మంత్రి గుమ్మనూరు జయరాం ఈ రోజు.. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం పేర్కొన్నారు.. సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని.. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఇక, ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం వైఎస్ జగన్ తనను కోరారని, కానీ, ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం తెలిపిన విషయం విదితమే. మరోవైపు.. జయహో బీసీ సభ వేదికగా గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!