Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ..! ఒకే చెప్పేశారు.. ఆ రోజే చేరిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఆ మధ్య జనసేనలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన్ని.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. కానీ, ఏం జరిగిందో తెలియదు.. ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుడుగు పడలేదు.. ఆ తర్వాత ఈ పరిణామాలపై ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
Read Also: Chandrababu – Pawan Kalyan Meet: చంద్రబాబు నివాసానికి పవన్.. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
అయితే, ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోయినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారట మిథున్ రెడ్డి.. ఇక, మీరు అడుగుతున్నారా? లేక సీఎం జగన్ అడగమన్నారా? అని మిథున్ రెడ్డిని ప్రశ్నించారట ముద్రగడ.. దీంతో.. సీఎం అడగమన్నారని మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే, పార్టీలో జాయినింగ్ కి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట ముద్రగడ.. సీఎంకు విషయం చెప్పి స్పష్టత ఇవ్వాలని మిథున్‌రెడ్డిని కోరారట.. అన్ని ఓకే అనుకుంటే సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముందు సీఎం జగన్ కి చెప్పండి.. ముహూర్తం బట్టి చూద్దాం అని ముద్రగడ చెప్పినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు.. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే జాయినింగ్ ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!