Minister Peddireddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తోన్న సమయంలో.. పొలిటికల్ లీడర్ల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి.. కొందరు విపక్ష పార్టీల కండువాలు కప్పుకుంటుంటే.. టీడీపీపై అసంతృప్తితో ఉన్న మరికొందరు లీడర్లు.. ఫ్యాన్ కిందకు చేరుతున్నారు.. అయితే, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చేరినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు నగరంలోని సంతపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన.. అనంతరం మాట్లాడుతూ సింహాలు సింగిల్‌గానే వస్తాయని.. అలాగే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరులో విజయానంద రెడ్డి సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తారని పేర్కొన్నారు. టీడీపీలో ఎంతమంది చేరినా వైసీపీదే విజయమన్న ఆయన.. ఇటీవల సీకే బాబు.. టీడీపీకి మద్దతు తెలపడంపై సెటైర్లు వేశారు. ఇక, చిత్తూరులో వైసీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: BRS- BSP Alliance: తెలంగాణలో కొత్త పొత్తు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ
మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఈ మధ్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎన్నికల సమయంలో చంద్రబాబు.. ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానని అంటారని ఎద్దేవా చేశారు.. గతంలో బాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు.. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని దుయ్యబట్టారు.. ఎన్నికల వేళ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారని చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం విదితమే.