CM YS Jagan: నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ ప్రాంతవాసుల వరప్రధాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.. 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజులు పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు.. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలించేందుకు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు..
Read Also: Viral Video : వామ్మో..పానీపూరిలో ఇన్ని రంగులు ఉన్నాయా?.. వీడియో చూస్తే అవాక్కవుతారు ..
ఇక, ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్‌లోకి వెళ్తే.. ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం వద్ద నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.30 కి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. 10.30 నుంచి 10.40 వరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు.. 10.40 నుంచి 10.50 వరకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు. 10.50 నుంచి 10.55 వరకు ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శన ఉంటుంది. 10.55 నుంచి 11.10 వరకు ప్రాజెక్టు లబ్దిదారులు, నిర్వాసితులతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రెండవ టన్నెల్ దగ్గరకు చేరుకుని 11.25 వరకు పనులను పరిశీలించనున్న సీఎం జగన్.. తిరిగి అక్కడ ఉదయం 11.30 కి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12.30కి తన నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.. ఇక, సీఎం పర్యటన నేపథ్యంలో.. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.