Vemireddy Prashanthi Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి చరిత్ర అంతా బయట పెడతా అని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రశాంతంగా వ్యాపారం చేసుకోనివ్వలేదు.. నాయకుల వద్ద కమీషన్ తీసుకుని పని చేశారు. బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా ఎకారానికి రూ.5 లక్షల వంతున కమీషన్ తీసుకున్నారు అని ఆరోపించిన ఆమె.. అలాంటి ప్రసన్న కుమార్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. కోవూరు నియోజవర్గంలో అవినీతిపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. చెత్త మాటలు మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Harish Rao: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మెడలు వంచుతాం
చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు… ఇదంతా ప్రజలు చూస్తున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి అంటూ మండిపడ్డారు ప్రశాంతిరెడ్డి.. ఈ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను అని ధీమా వ్యక్తం చేశారు.. ఈ ఐదు సంవత్సరాలలో గ్రావెల్.. ఇసుకలో ఎంతో దోచుకున్నారు. నేతలు ఇచ్చే కమీషన్ చాలక పోతే వారిని బయటికి పంపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కాగా, ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ.. టీడీపీలో చేరిన విషయం విదితమే..