సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మమల్ని గెలిపిస్తాయని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు. ఇక, మార్కాపురం నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు.. వారు వైసీపీకి అండగా ఉంటారని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. నేడు(గురువారం) మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.