CM YS Jagan: జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.. శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 58 నెలలో 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం.. మీకు మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైన్యంలా నిలవండి అని కోరారు. అనేక కుట్రలకు చంద్రబాబు దిగజారుతున్నాడు.. ఎలాంటి మార్పులు తీసుకోచ్చామో.. కనీసం, ఆత్మ విమర్శ చేసుకున్నారా చంద్రబాబు? అని ప్రశ్నించారు. దోచుకోవడానికి… పంచుకోవడానికి అధికారం కావలట.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా.. ఆయన చేసిన ఓక్క మంచైనా గుర్తుకు వస్తుందా? అని నిలదీశారు.
Read Also: UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా… బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు సీఎం జగన్.. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు తలెత్తుకుని నిలబడ్డా.. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో పెడతాను అన్నారు. చంద్రబాబులా అబద్దపు హామీలు ఇవ్వను.. జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందన్నారు. బాబులా మోసపు వాగ్దానాలు చేయను.. మోసంను నిజాయితీతో నిరూపించడానికి నేను సిద్దం.. మీరు సిద్దమా..? అని ప్రశ్నించారు. బాబు లాంటి మోసగాడు కావాలా.. జగన్ లాంటి నిజాయితీపరపడు కావాలా? మూడు సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని చంద్రబాబు కావాలా..? తేల్చేకోవాలన్నారు. దత్తపుత్రుడు.. ఢిల్లీ నుండి.. తెచ్చుకున్న మోడి పాంప్లేట్ 2014 లో ఇంటింటికి పంపారు బాబు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేసాడా ? పొదుపుసంఘాల రుణ మాఫీ చేసాడా? ఆడపిల్లలకు ఓక్క రూపాయైనా డిపాజిట్ చేసాడా? ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి.. ఇచ్చాడా ? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం అన్నాడు.. ఓక్క సెంటైనా ఇచ్చాడా? సింగపూర్ .. అభివృద్ధి అన్నాడు.. జరిగిందా ..? శ్రీకాకుళం, టెక్కలిలో ఓక్కటైనా అబివృద్ది జరిగిందా..? ఇదే ముగ్గురు కూటమి సూపర్ 6 , 7 అంటూ వస్తుంది.. ఇంటింటికి కేజి బంగారం.. కారు ఇస్తామంటున్నారు నమ్ముతారా ? ఇలాంటి మోసాల నుండి కాపాడటానికి.. పోరాటానికి మీరంతా సిద్దమా..? అని ప్రశ్నించారు జగన్..
Read Also: Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
వాలంటీర్లు ఇంటికి రావాలన్నా.. లంచాలు లేని పాలన జరగగాలన్నా.. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి అని పిలుపునిచ్చారు సీఎం జగన్.. 175 అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలకు ఒక్కటి కూడా తగ్గకూడదు అన్నారు. ఆలోచించండి .. ఇంట్లో వారి అభిప్రాయం తెలుసుకోండి.. ఎవరు అండగా ఉంటే వారితోనే అడుగు వేయండి.. ఎంపీ అభ్యర్థి గా.. తిలక్ ని నిలబెడుతున్నా.. తనకి అవకాశం ఇవ్వండి… ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనుని పెడుతున్నా.. ఒక్క సారి మార్చండి.. శ్రీను మంచి చేసి చూపిస్తాడు.. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.