Veera Shiva Reddy: కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రేపే వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Shiva Reddy: కడప జిల్లా కమలాపురంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. రేపు అనగా గురువారం రోజు పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి.. కమలాపురం టిక్కెట్ ఆశించి బంగపడ్డ వీర శివారెడ్డి.. టికెట్ రాకపోవడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనే టీడీపీ గూటికి చేరుకున్నారు కమలాపురం నియోజకవర్గానికి చెందిన వీరశివారెడ్డి.. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
Read Also: Salman Khan: కాల్పుల కేసులో నిందితుల్ని విచారించిన ఢిల్లీ పోలీసులు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తొలినాళ్లలో టీడీపీలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు వీరశివారెడ్డి.. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. 2004లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు.. అయితే, 2009 ఎన్నికల నాటికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలిపొందారు. తర్వాత, ఏపీ పునర్విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.. ఇక, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.. కానీ, తగినంత ప్రాధాన్యత దక్కడం లేదంటూ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ఈ ఏడాది జనవరిలో సైకిల్ ఎక్కిన ఆయన.. కమలాపురం టికెట్ ఆశించారు.. అది సాధ్యం కాకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!