ఇన్నాళ్ళు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
ఇరిగేషన్పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఇవాళ లండన్ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్ బయల్దేరనున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని…
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలోపేతంపై పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. నేతలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అధినేత జగన్ స్వయంగా నేతలతో సమావేశాన్ని నిర్వహించి...పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్.. మాస్ కాదు.. ఊర మాస్ ఇమేజ్ ఉన్న పార్టీ. దాదాపు ప్రతి చర్య, కార్యక్రమం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అలాగే... పార్టీ కేడర్కు కూడా తమ అధినేత జగన్ అంటే పిచ్చి. అది ఎంతలా అంటే... చేసింది తప్పా, ఒప్పా అన్న దాంతో సంబంధం లేదు. జగనన్న చేశాడంటే... చెప్పాడంటే... అది కచ్చితంగా కరెక్ట్ అనుకునేంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రేంజ్లో ఉన్న ఫీలింగ్...
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు.
కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు..